– విద్యార్ధి దశ నుండే ప్రశ్నించడం అలవర్చుకోవాలి
– ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట : నాటి బాలల మే నేడు పౌరులుగా ఉన్నామని మా లాగే నేడు బాలలు గా ఉన్న మీరే రేపటి పౌరులుగా తయారు అవుతారని విద్యాశాఖ మండల అధికారి( ఎంఈఓ ) పొన్నగంటి ప్రసాదరావు అన్నారు.
ప్రతీ ఏడాది నవంబర్ 14 న భారత దేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవాన్ని శుక్రవారం మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు.
మండలంలోని మామిళ్ళవారిగూడెం పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధి దశ నుండే స్వంతంగా ఆలోచించడం,తెలియని విషయాలను తల్లిదండ్రులను,ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం,రోజు వారీ వార్తాపత్రికలు చదవడం ద్వారా లోకజ్ఞానం పెంపొందించుకోవాలని అన్నారు.
నేడు శాస్త్రజ్ఞులు గా,కవులుగా,రచయితలుగా,రాజకీయ కోవిదులు గా,మేధావులుగా పరిణితి చెంది ప్రతీ ఒక్కరు వారి బాల్యంలో స్వంత ఆలోచనలు,పరిశీలనతో పెరిగిన వారేనని అన్నారు.పిల్లలు అంటే నెహ్రూ కు అత్యంత ప్రీతి పాత్రం అని,తన కూతురు,మాజీ ప్రధమ మహిళా ప్రధాని ఇందిరా గాంధీ కి తాను రాసిన ఉత్తరాల ద్వారా అనేక అంశాలను తెలిపే వారని అన్నారు.
గుమ్మడి వల్లి,రామన్నగూడెం,జవహర్ విద్యాలయం పాఠశాలల్లో సంస్క్రుతి క కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో గుమ్మడి వల్లి ప్రధానోపాధ్యాయులు తాళ్ళపాటి వీరేశ్వరరావు, ఉపాద్యాయులు తాటి శ్రీనివాసరావు,ఉయ్యాల ప్రసాదరావు,ఇనుగంటి ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.



