శిష్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
నవతెలంగాణ – మిర్యాలగూడ
నేటి బాలలే రేపటి పౌరులని శిష్య పాఠశాలల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. చిన్నారులు వివిధ వేషాదరణలతో అలరించారు. జాతీయ నాయకులు ఆర్మీ, నేవీ, పోలీస్ అధికారుల, రుద్రమదేవి, నెహ్రూ వేషధారణలతో అబ్బురపరచారు. అంతకుముందు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ నాయకుల చరిత్ర తేలుకోవాల్సిన అవసరం విద్యార్ధులకు ఉందని చెప్పారు. వారు చేసిన త్యాగాలను స్పూర్తిగా తీసుకొని విద్యార్ధులు ఉన్నతస్థానాలకు ఎదగాలన్నారు. చదువులో రాణించి భవిష్యత్తు లో స్థిరపడాలన్నారు. చిన్నారుల్లో ఉల్లాసం నింపేలా ఇలాంటి వేడుకలు ఉపయోగపడుతాయన్నారు. అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



