Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు 'మండలి' భవనం ప్రారంభం

రేపు ‘మండలి’ భవనం ప్రారంభం

- Advertisement -

ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శాసనమండలి నూతన భవన ప్రారంభోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల ఎనిమిదిన ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరై ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబుతోపాటు కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మహమ్మద్‌ అజహరుద్దీన్‌, శాసనమండలి వైస్‌ చైర్మెన్‌ బండ ప్రకాశ్‌, ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు ఎస్‌ వాణీదేవి, ఏవీఎన్‌ రెడ్డి, మీర్జా రియాజుల్‌ హసన్‌ ఎఫెండి, మీర్జా రెహమత్‌ బేగ్‌, బి దయానంద్‌, ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌, సీఎస్‌ కె రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొంటారు. ఈ మేరకు శాసనమండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. భవిష్యత్‌లో శాసనమండలి సమావేశాలు నూతన భవనంలోనే కొనసాగుతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -