Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంపట్టాలు తప్పిన‌ పర్యాటక రైలు.. 15 మంది దుర్మరణం

పట్టాలు తప్పిన‌ పర్యాటక రైలు.. 15 మంది దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే చారిత్రక గ్లోరియా ఫ్యూనిక్యులర్ (కేబుల్ రైలు) పట్టాలు తప్పి బోల్తా పడింది. ఈ ఘోర దుర్ఘటనలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ అధికారులు వెల్లడించారు.

లిస్బన్ నగర నడిబొడ్డున ఉన్న అవెనిడా డా లిబర్డేడ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు ఫ్యూనిక్యులర్ క్యారేజ్ నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ విషాదకర ఘటన నేపథ్యంలో పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఆదివారం వరకు జరగాల్సిన పుస్తక మహోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితుల జ్ఞాపకార్థం, వారి కుటుంబాలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం గురువారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఇది లిస్బన్‌కు అత్యంత కష్టమైన రోజని, నగరం తీవ్రంగా పోరాడుతోందని మేయర్ కార్లోస్ మోదాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad