Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ స్టేషన్ లో వైర్ లెస్ సీసీటీవీ కెమెరాల కోసం టవర్ ఏర్పాటు  

పోలీస్ స్టేషన్ లో వైర్ లెస్ సీసీటీవీ కెమెరాల కోసం టవర్ ఏర్పాటు  

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజిపేట మండల కేంద్రంలో వున్నా పోలీస్ స్టేషన్ లో దాత చిలుకా సురేందర్ రెడ్డి సహాయంతో వైర్ లెస్ సీసీటీవీ కెమెరాల కోసం టవర్ ను ఏర్పాటు చేసినట్లు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ తిమ్మాజిపేటలో ఉన్న వైర్ లెస్ కెమెరాలను టవర్ కు అనుసంధానం చేయడం ద్వారా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ లో కెమెరాలను చూడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

గత కొంత కాలంగా అన్ని గ్రామాలలో తిరిగి సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. మండలంలోని అన్ని గ్రామాలలో కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి వైరు లేకుండా ఏ సంఘటనలు తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ లో చూడడానికి అవకాశం ఉంటుందని అన్నారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ ముందుకు వచ్చి వీలైనంత త్వరగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -