నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాదులో భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి అనంతరం టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ..భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ను స్మరించుకుంటు నివాళులు అర్పించాలన్నారు. భారత రాజ్యాంగం యావత్ ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగం. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. గాంధీ, నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుంది.విద్యావంతులు, మేధావులు అరాచక శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఇతర దేశాలకు స్ఫూర్తి అని అన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



