నవతెలంగాణ-మల్హర్ రావు.
ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాల పదవీకాలం గడువు మరో 6 నెలలపాటు పోడగించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య కు టిపిసిసి ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సత్కరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహాయంతో తాడిచర్ల సొసైటీని మరింత అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా శ్రీనుబాబు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి,మండల మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,కోడారి చినమల్లయ్య యాదవ్,ఏఎంసి,ప్యాక్స్ డైరెక్టర్లు పాల్గొన్నారు
పిఏసిఎస్ చైర్మన్ మొoడయ్యను సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES