- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలో ఆదివారం సాంప్రదాయ బద్ధంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హాజరయ్యారు. మహిళలతో కలిసి పూజలు చేసి, తీజ్ పండుగ సంప్రదాయాల్లో భాగమయ్యారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..తీజ్ పండుగ అనేది మహిళల ఆచార వ్యవహారాలకు ప్రతీక. ఇది మన సాంప్రదాయ విలువలను గుర్తు చేస్తూ, కుటుంబాల్లో ఐక్యతను పెంపొందించే పండుగ. ఇలాంటి ఉత్సవాలు మన సంస్కృతిని తరతరాలకు నిలబెడతాయి” అని అన్నారు. కార్యక్రమంలో మహిళలు ఆనందంగా పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సవ వాతావరణాన్ని నెలకొల్పారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -