నవతెలంగాణ – ఊరుకొండ
వ్యవసాయ పొలంలో కరిగేట చేసేందుకు ట్రాక్టర్ సాయంతో పొలాన్ని దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిపోవడంతో ట్రాక్టర్ డ్రైవర్ కళ్యాణ్ శివయ్య (25) అనే ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన సంఘటన గురువారం ఊరుకొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై కృష్ణదేవ తెలిపారు.
ఎస్సై కృష్ణదేవ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన కళ్యాణం జంగాల తిరుపతయ్య మూడో కుమారుడు కళ్యాణం శివయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్ గ్రామానికి చెందిన బూజూరు మల్లేష్ అనే రైతు వ్యవసాయ పొలంలో కరిగేట చేసేందుకు ట్రాక్టర్ దున్నేందుకు వెళ్లి పొలం దున్నుతుండగా ప్రమాదవశత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో శివయ్య ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. చుట్టుపక్కల వ్యవసాయ పొలంలోనీ రైతులు శివయ్య ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొనీ చూడగా శివయ్య ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు శివయ్య భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.



