శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పై రెండవ ప్రాజెక్టుగా సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వంలో శివాజీ, లయ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పధ్వీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. 90 వెబ్ సిరీస్‌లో శివాజీ, రోహన్ మధ్య వచ్చే ఈ బీజీఎం వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్‌గా శివాజీ కనిపించనున్నారు.
టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివాజీ, లయ సీరియస్‌గా నడుస్తూ ముందుకు వస్తుండగా రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించడం అందర్నీ అలరిస్తోంది. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్లు మోషన్ పోస్టర్‌లో ఉండటం విశేషం. ఈ చిత్రానికి నిర్మాత : శివాజీ సొంటినేని, రచన – దర్శకత్వం : సుధీర్ శ్రీరామ్, సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్, ఎడిటర్ : బాలు మనోజ్.డి, కెమెరామెన్ : రిత్విక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ లింగం, ధీరజ్.పి.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’
- Advertisement -
- Advertisement -