Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బిద్రెల్లి వాగు ఉదృతంతో నిలిచిపోయిన రాకపోకలు...

బిద్రెల్లి వాగు ఉదృతంతో నిలిచిపోయిన రాకపోకలు…

- Advertisement -

– పరిస్థితులను సమీక్షించిన బైంసా అడిషనల్ ఎస్పీ
నవతెలంగాణ -ముధోల్: బాసర మండలంలోని బిద్రెల్లి వాగు గురువారం భారీ వర్షంతో ఉదృతంగా ప్రవహించడంతో నిజామాబాద్ ,బైంసాకు రాకపోకలు గురువారం నిలిచిపోయాయి. బుధవారం రాత్రి నుండి గురువారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురియటంతో బిద్రెల్లి వాగు ఉదృతంగా ప్రవహించడంతో బాసర, బైంసా ,రహదారిపై ఉన్న బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో నిజామాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు బిద్రెల్లి గ్రామంలో ఆగిపోయాయి. భైంసా వైపు నుండి వచ్చే వాహనాలు బ్రిడ్జి ఇవతల వైపు ఆగిపోయాయి. దీంతో రోడ్డు ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.

ప్రయాణికులు, వానదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కూమార్, ముధోల్ సిఐ మల్లేష్ పరిశీలించారు. వాగు ఉదృతి తగ్గిన తర్వాతే వాహనాలను అనుమతించాలని పోలిసులకు సూచించారు.బైంసా వైపు నుంచే వచ్చే వాహనాలను సిఐ మల్లేష్, పోలిసులు నిలిపివేయించారు. వాహనాలు వెళ్లకుండా పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలను బాసర ఎస్ఐ శ్రీనివాస్, పోలిసులు వాహనాలను బిద్రెల్లి వద్ద ఆపివేశారు. వాగు ఉదృతి తగిన తర్వాతనే వెళ్లాలని పోలిసులు సూచించారు. అత్యవసర ఉంటే ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలిసులు పేర్కొంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad