నవతెలంగాణ-హైదారాబాద్: ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా..సిటీలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీని జారీ చేశారు. మహంకాళి ఆలయం నుంచి టొబాకో బసార్, హిల్ స్ట్రీట్ కాలనీ రోడ్డు మూసివేయనున్నారు. సుభాష్ నగర్, బాటా ఎక్స్ రోడ్ నుంచి రొచ్చ బజార్, సికింద్రాబాద్‌కు వెళ్లే రోడ్డు క్లోజ్ చేయనున్నారు. అదేవిధంగా మహంకాళి ఆలయం నుంచి అడివియ్య ఎక్స్ రోడ్, మహంకాళి టెంపుల్ నుంచి జనరల్ బజార్ రోడ్లను పూర్తిగా మూసివేయనున్నారు. ఈ మేరకు వాహదారులు ప్రత్యమ్నయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తూ ట్రాఫిక్ పోలీసులు మ్యాప్‌ను విడుదల చేశారు.
హైదరాబాద్‌లో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES