Friday, January 9, 2026
E-PAPER
Homeకరీంనగర్ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి

ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి.పర్షారాములు అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా రోడ్డు సురక్షా అభియాన్–2026 పై గురువారం సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ చౌరస్తాలో జిల్లా రవాణా శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులతో సంయుక్తంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా  మొబైల్ ఫోన్ వాడుతూ వాహనం నడపకూడదని, రోడ్డు ప్రమాదాల ద్వారా అమూల్యమైన ప్రాణ నష్టం జరగకుండా ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వి. లక్ష్మణ్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపెల్లి శ్రీనివాసరావు, ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, కడగండ్ల తిరుపతి, రాగుల కరుణాకర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -