- Advertisement -
నవతెలంగాణ – బల్మూరు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రం నుండి అచ్చంపేట ప్రధాన రహదారి నుండి రాకపోకలు బంద్ అయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెడ్ చెరువు వద్ద నీటి ప్రవాహం పెరిగి రోడ్డుపై పారుతుండడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. అక్కడే వ్యవసాయ పొలంలో నివాసం ఉంటున్న బోట్క బాలయ్య పూరిగుడిసె నీట మునిగింది. అతనికి చెందిన పశువులు గేదెలు నీడ చిక్కుకున్నాయి. పంట చేలు పూర్తిగా నీడ మునిగాయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



