మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్
చదువులేని దిగువ సామాజిక వర్గాల వారిని లక్ష్య్రంగా చేసుకుని కొన్ని ముఠాలు వెట్టి చాకిరి చేయిస్తున్నట్టు తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ కె. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో ”హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్” అంశంపై తెలంగాణ మీడియా అకాడమీ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహించాయి. ఈ సందర్భంగా చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మానవ అక్రమ రవాణా సమాజంలో అత్యంత బలహీనవర్గాల వారిపై ప్రభావం చూపుతున్నదన్నారు. బాధితుల్లో సగానికి పైగా బలవంతపు లేదా బాండెడ్ లేబర్‌లో ఉన్నారనీ, వారంతా ఇటుక బట్టీలు, గహా నిర్మాణం, ప్రాజెక్టు పనులు, బహుళ అంత్తసులలో పనులు, వస్త్ర కర్మాగారాలు, వ్యవసాయం లేదా రాతి గనులలో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేస్తున్నారని చెప్పారు.
అలాంటి వారిని గుర్తించి మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. వారంతా దళారుల చేత మోసగించినవారై ఉన్నారని గుర్తు చేశారు. దళారులు వారికి కూలి పని కల్పిస్తామని ముందుగానే ఎక్కువ డబ్బులు ఆశ చూపి వడ్డీ ద్వారా అప్పులు సమకూర్చడం ద్వారా వారి జీవితాలను, వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆయన అన్నారు. శ్రమను దోచుకుంటున్నవారిని శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మరణించిన కార్మికుల అప్పులు వారి పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రులకు బదిలీ చేసి ఇంకా వేదిస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. తక్కువ నైపుణ్యం కలిగిన రంగాలలో పని కోరుకునే భారతీయ వలసదారులు వివిధ దేశాలకు వలసల పేరుతో కార్మికులు అక్రమ రవాణాలో చిక్కుకుంటున్నారని తెలిపారు.
ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ఎన్జీవోల బందం మానవ అక్రమ రవాణా నేరాలకు సంబంధించిన దర్యాప్తు ఆధారాలను సేకరించడం, ప్రాణాలతో బయటపడిన వారిని విడిపించడం, అక్రమ రవాణాదారులను అరెస్టు చేయడంలో పోలీసులకు సహాకారం అందించి బాధితులకు తగు న్యాయం చేసేలా కషి చేస్తోందని ఆ బందం సభ్యులు ఈ శిక్షణలో బోధించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, ఐజేఎం మీడియా కమ్యూనికేషన్స్ అధిపతి ప్రియా అబ్రహాం తదితరులు పల్గొన్నారు.
బలహీనుల అక్రమ రవాణా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES