Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం.. పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

విషాదం.. పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

- Advertisement -

నవతెలంగాణ – మహాదేవపూర్: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకొంది. ఓ ప్రయివేటు పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. అంబటిపల్లికి చెందిన సింగనేని మల్లేశ్‌, భాగ్య దంపతుల కుమారుడు అనివిత్‌ను పాఠశాల బస్సు ఎక్కించడానికి కుమార్తెతో కలిసి తల్లి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కింద కుమార్తె శ్రీహర్షిణి (3) పడి అక్కడిక్కడే మృత్యువాత పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -