గుండెపోటు రావడంతో కుప్పకూలిన భక్తుడు
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విషాదం నెలకొంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన పాకనాటి సోమిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం పాలకుర్తి ఆలయంలో అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చారు. ఆలయంలో దర్శనానికి వెళ్లే సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
మెరుగైన వైద్యం కోసం పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులు మండల కేంద్రంలో గల ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. సోమిరెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామంలో విషాదం నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు గంటల పాటు క్యూలైన్ లో వేచి చూడాల్సిన పరిస్థితి. భక్తుల రద్దీ సమయంలో పూజా కార్యక్రమాలను సరిత గతిన ముగించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
సోమేశ్వరాలయంలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



