Tuesday, July 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాతబస్తీలో విషాదం.. విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి

పాతబస్తీలో విషాదం.. విద్యుత్‌షాక్‌తో ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బండ్లగూడ సమీపంలో భారీ వర్షాల కారణంగా రోడ్డుపై తెగిపడి ఉన్న విద్యుత్‌ తీగలను గమనించక ఇద్దరు యువకులు విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు, ఆటోలో ప్రయాణిస్తున్న జాఫర్‌ (25), అబూ (16) బండ్లగూడ వద్ద ఆటో దిగిన వెంటనే రోడ్డుపై పడివున్న విద్యుత్‌ తీగలను తాకడంతో తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -