– పదవ తరగతి విద్యార్థి ప్రణవ్ మృతి
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని సవర్గావ్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. స్కూల్ కు వెళ్లే సమయంలో ఆటో బోల్తా పడడంతో పదవ తరగతి చదువుతున్న చిన్నారి ప్రణవ్ దుర్మరణం చెందడం హృదయ విదారకంగా మారింది. ఈ వార్త తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే వెంటనే ప్రణవ్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అకాల మరణం కుటుంబంపై పడిన భారీ దెబ్బను అర్ధం చేసుకున్న ఆయన, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
“చిన్నారి ప్రాణం కోల్పోవడం చాలా బాధాకరం.. కుటుంబానికి ఇది భరించలేని నష్టం. దేవుడు వారికి శాంతి, ధైర్యం ఇవ్వాలి” అని హన్మంత్ షిండే తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎంపీపీ నీలు పటేల్, గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ పవర్, అశోక్ పటేల్, దిలీప్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



