Saturday, December 6, 2025
E-PAPER
Homeక్రైమ్విషాదం: కాలువలో పడి వివాహిత మృతి.. కుమారుడి గల్లంతు

విషాదం: కాలువలో పడి వివాహిత మృతి.. కుమారుడి గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలో పడి వివాహిత త్రివేణి (25) మృతి చెందగా, ఆమె ఏడు నెలల కుమారుడు శరత్ గల్లంతయ్యాడు. భర్త శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, త్రివేణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, భార్యాకొడుకులను భర్తే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లు వివాహిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -