- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో తన తమ్ముడు పోతు శేఖర్ 187 ఓట్ల తేడాతో ఓడిపోయాడని తెలిసి, అక్క కొప్పుల మమత (38) గుండెపోటుతో మృతి చెందింది. ఎన్నికల ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న మమత, కౌంటింగ్ సమయంలో తమ్ముడు వెనకంజలో ఉన్నాడని తెలుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది.
- Advertisement -



