- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాముకాటుతో మూడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజాబాబాద్(D) బాన్సువాడ(M) కాలు నాయక్ తండాలో జరిగింది. తండాకు చెందిన చౌహన్ శ్రీకాంత్ కుమార్తె సరస్వతి(3) నిన్న రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించింది. బుధవారం ఉదయం 6 గంటలకు నిద్రలేవగానే వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
- Advertisement -



