Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం..అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ మహిళ మృతి

విషాదం..అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది. హైదరాబాద్ కంచన్‌బాగ్‌కు చెందిన ప్రయివేటు స్కూల్ టీచర్ ప్రియాంక మోల్‌ ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి అనంతగిరి వెళ్లారు. ట్రెక్కింగ్‌ చేస్తూ వ్యూపాయింట్‌ దగ్గరకి వెళ్లిన సమయలో ప్రియాంక తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన ప్రియాంక విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -