- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ చౌదరి(19) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. హాస్టల్ గదిలో ఉరి వేసుకొని వేలాడుతున్న సాహిల్‌ను చూసి.. తోటి విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థి సాహిల్ ది రాజస్థాన్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -