Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంక్షేమ పథకాలపై శిక్షణా శిబిరం..

సంక్షేమ పథకాలపై శిక్షణా శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : జూలై 1వ తేది నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు జరుగనున్న జనసురక్షా ప్రచార కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం సూచనల మేరకు భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో ఆర్థిక సంక్షేమ పథకాలపై సమగ్ర శిబిరం నిర్వహించబడినట్లు ఎల్డిఎం తిరుపతి తెలిపారు. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – కాటారం శాఖ ఆధ్వర్యంలో  గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఎల్డిఎం హాజరై మాట్లాడారు.

ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రధానమంత్రి జనధన్ యోజన (పిఎంజెడివై), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (పిఎంఎస్బి), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజెజెబి), అటల్ పెన్షన్ యోజన (ఏపివై), అలాగే కెవైసి పునరిద్దరణ నూతన నమోదులు మరియు పునర్నవీకరణలను చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఈ ప్రధాన ఆర్థిక సామాజిక భద్రతా పథకాల పరిధిని 100% పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్, అంకుషాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -