Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ సంఘాల సభ్యులకు శిక్షణ: ఏపీఎం

గ్రామ సంఘాల సభ్యులకు శిక్షణ: ఏపీఎం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల మహిళ సమాఖ్య ఐకెపి ఆధ్వర్యంలో విధులపై సోమవారం మొదటి రోజు శిక్షణ తరగతులు పూర్తి అయినట్లు ఐకెపి ఎపిఎం రవీందర్ తెలిపారు. ఈ శిక్షణ తరగతులు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక అధ్యక్షతన జరిగింది. మొదటి బ్యాచ్  శిక్షణ సిఆర్పిలు జంగమ్మ, నర్సింగమ్మలు, పాలక వర్గ సభ్యుల విధులు బాధ్యతలు, సంఘాల, గ్రామ సంఘాల నిర్వహణ, ఆర్ధిక నిర్వహణ మొదలగు అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.  ఈ శిక్షణలో సిఆర్పి లు, ఏపీఎం, సీసీ లు, 21గ్రామ సంఘాల పాలక వర్గ సభ్యులు, అకౌంటెంట్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -