జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
పంటకోత ప్రయోగాల డిజిటల్ ఆప్ పైన శిక్షణ తరగతులను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ ఎస్ఓ , ఏఈఓ లు వారికి కేటాయించిన గ్రామాలలో ఎటువంటి పొరపాటు లేకుండా పంటకోత ప్రయోగాలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సేకరించిన వివరాలను సమయానికి డి జి సి ఈ ఎస్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు పంటకోత ప్రయోగములు నిర్వహిస్తున్నప్పుడు ప్రాథమిక కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , సూచనలు తెలియచేసారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రమణ మాట్లడుతూ సేకరించిన వివరాలను సమయానికి డిజి సి ఈ ఎస్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు
పంటకోత ప్రయోగాల ప్రాముఖ్యత….
పంటకోత ప్రయోగాలు కేవలం ఒక సర్వే కాకుండా, రైతులకు , ప్రభుత్వానికి ఉపయోగకరమైన అంచనాలు వేయడానికి ఉపయోగపడతాయని,పంటల దిగుబడి అంచనా వేయడానికి, ప్రభుత్వం వ్యవసాయము , పంటలపై తగు విధానపరమైన నిర్ణయాలు తీసుకొడానికి దోహదపడుతుందనారు.మార్కెట్ ధరలు, ఎగుమతులు, దిగుమతులు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉపయోగపడుతుందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ రమణ,జిల్లా వ్యవసాయ అధికారి వెంకట రమణ, నీలిమ,యం పి ఓ లు, ఏ ఈ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.