Monday, July 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకాలేజీపై కూలిన శిక్షణ విమానం.. ఒకరు మృతి

కాలేజీపై కూలిన శిక్షణ విమానం.. ఒకరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన ఈ రోజు మధ్యాహ్నం బంగ్లాదేశ్‌లోని నార్త్ ఢాకాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్‌లో విద్యార్థులు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ ఎఫ్-7 బీజీఐ వైమానిక దళానికి చెందినదని ధృవీకరించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఓ విద్యార్థి మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయని అగ్నిమాపక అధికారి లిమా‌ఖాన్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -