Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హన్డే కేలూలో సోయాబీన్ పంటపై శిక్షణ కార్యక్రమం

హన్డే కేలూలో సోయాబీన్ పంటపై శిక్షణ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కెలూర్ గ్రామంలో సోయా పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ.. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకం కింద డిఎస్ బి34 రకం సోయాబీన్ విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. 

అందులో భాగంగా సోమవారం  క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు సోయాబీన్ పంటల మీద ప్రస్తుత పంట యాజమాన్య పద్ధతులు వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు సోయాబీన్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు సూచించడం జరిగింది. 

అలాగే సోయాబీన్ వేసిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి , పొగాకు  లద్దె పురుగు  గమనించి తగు నివారణ చర్యలు తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో  ఎఫ్ పి ఓ చైర్మన్ చట్ల వార్ గోపాల్, ఏఈ వో సరోజ, మాజీ సర్పంచ్ హన్మండ్లు , మాజీ ఎంపీటీసీ విజయ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -