Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బదిలీలు పదోన్నతుల షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలి

బదిలీలు పదోన్నతుల షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలి

- Advertisement -

స్టీరింగ్ కమిటీ నాయకులు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు షెడ్యూలు తక్షణమే విడుదల చేసి అమలు చేయాలని, పే రి విజన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలని, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) స్టీరింగ్ కమిటీ నాయకులు వై. విజయ్ కుమార్, పి.శంతన్, గంగాధర్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా స్టీరింగ్ కమిటీ సమావేశం జరిపి ఆగస్టు 1న రెండవ దశ జిల్లా స్థాయి ధర్నా విషయమై చర్చించడం జరిగింది. పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట *ధర్నా* నిర్వహించాలని అందుకు ఉపాధ్యాయులను సమీకరించాలని మొదలైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ మొత్తం 30 డిమాండ్లు సాధన కొరకు మూడు దశల ఉద్యమ కార్యచరణ మొదలైందని మొదటి దశ మండల రెవెన్యూ అధికారుల ద్వారా ముఖ్యమంత్రికి వినతులను ఈనెల 23, 24 న మెమొరాండం లు సమర్పించామని, ఆగస్టు 23న చలో హైదరాబాద్ మహా ధర్నాను నిర్వహించనున్నామని తెలియజేస్తున్నాము. వివిధ జిల్లాలలో అర్హతలు లేని వారు డీఈవోలుగా పనిచేస్తున్నారని వారిని తక్షణమే తొలగించాలని అర్హతలు ఉన్న వారితో డీఈవోలుగా నియమించాలని, డిప్యూటీ డిఇఓ ఎంఈఓ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డి ఏ లలో తక్షణమే రెండు డీఎలు చెల్లించాలని తెలిపారు. నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

ప్రాథమిక పాఠశాలలో ఉన్న కాళీ పోస్టులను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని, ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న వివిధ రకాల బిల్లుల మంజూరు తక్షణమే చేపట్టాలని అన్నారు. 55 71 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని తెలిపారు. పండితుల అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జీవో 2,3,9,10 లను రద్దుచేసి 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించి అమలు చేయాలని వివిధ జిల్లాలలో జరిగిన అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని అన్నారు.

కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని అన్నారు. అన్ని ఉన్నత పాఠశాలలకు ఉచ్చతర ప్రాథమిక పాఠశాలకు పీఈటీ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేయాలని తెలిపారు. మోడల్ స్కూల్ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని అన్నారు. మొదలైన సమస్యల పరిష్కారం కొరకు ఆగస్టు 1వ తేదీన పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న యుఎస్పిసి ధర్నాకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాటి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఒ మాజీ సిహెచ్ సుదం, దాసరి పెంటన్న, రాజారాం, లింగన్న, రవికుమార్, పోషణ, లింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -