Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగ్రేటర్‌లో 23 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీ

గ్రేటర్‌లో 23 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో విస్తృత స్థాయిలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పలువురికి పదోన్నతులు కూడా ఇచ్చి కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. ఇందులో ఎవరెవరు ఎక్కడి నుండి ఎక్కడికి బదిలీ అయ్యారంటే..

ఖైరతాబాద్ సర్కిల్‌కు జయంత్‌ ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, యూసఫ్‌గూడా డీసీగా రజనీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్‌ గా జకియా సుల్తానా, చందానగర్‌ కు శశిరేఖ, ఉప్పల్‌ కు రాజును నియమించారు. అలాగే, సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఆంజనేయులు, గోషామహల్‌ కు ఉమా ప్రకాష్, రాజేంద్రనగర్‌ కు రవికుమార్, ఎల్బీనగర్‌ కు మల్లికార్జునరావు, హయత్‌ నగర్‌ కు వంశీకృష్ణ బాధ్యతలు చేపడతారు. అలాగే మూసాపేట్ డిప్యూటీ కమిషనర్‌గా సేవా ఇస్లావత్, బేగంపేట్‌ కు డాకు నాయక్‌ను నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -