5న ఖాళీల వారీగా తుది జాబితా విడుదల
డీఈఓ రమేష్ కుమార్
నవతెలంగాణ – తిమ్మాజిపేట
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రారంభం అయిందని, ఉపాధ్యాయుల పదోన్నతులను సీనియారిటీ ఆధారంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయుల నుంచి 39 మంది జీహెచ్ఎంలుగా, 109 మంది స్కూల్ అసిస్టెంట్లు, 22 మంది పీఎస్ హెచ్ఎంలు పదోన్నతి పొందనున్నారని ఆయన తెలిపారు.
డిఇఓ కార్యాలయంలో ఇటీవలే విడుదల చేసిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా పై ఉపాధ్యాయుల నుండి అభ్యంతరాలను స్వీకరించినట్లు డిఇఓ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో అర్హులైన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఆధారంగానే ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియలు చేపట్టనున్నట్లు డిఇఓ తెలిపారు. ముందుగా నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 36 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న జిహెచ్ఎంలు, మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న జిహెచ్ఎంల పదోన్నతులకై జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ ల సీనియారిటీ జాబితా ను ప్రాంతీయ విద్యా సంచాలకులు హైదరాబాద్ కు పంపించడం జరిగిందని ఆయన తెలిపారు. జిహెచ్ఎంల పదోన్నతుల వివరాలు ఆర్జెడి కార్యాలయం నుండి వెల్లడి కానున్నాయని డీఈవో తెలిపారు.
జిల్లాలో ఖాళీల ఆధారంగా అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్ జి టి)ల సీనియారిటీ జాబితా ప్రకారం 138 మంది ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా పదోన్నతులను కల్పించనున్నట్లు తెలిపారు. లోకల్ బాడీ పాఠశాలల్లో ఖాళీల వారిగా పదోన్నతుల వివరాలు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గా (ఎల్ ఎఫ్ ఎల్) 22 మంది, గణితంలో 11మంది, భౌతిక శాస్త్రంలో ఇద్దరికీ, జీవశాస్త్రంలో 16మందికి, సాంఘిక శాస్త్రంలో 25 మందికి, హిందీలో 10 మందికి, తెలుగులో 8 మందికి, ఇంగ్లీషులో 8 మందికి, ఫిజికల్ డైరెక్టర్ గా ఒక్కరికి, లోకల్ బాడీ ఉర్దూ మీడియంలో గణితంలో ఒక్కరికి, బయో సైన్స్ లో ఒక్కరికి, సోషల్ లో ఇద్దరికీ, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ లాంగ్వేజ్ లో ముగ్గురికి, ఉర్దూ, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో 15 మంది లోకల్ బాడీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్నట్లు డిఇఓ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో గణితంలో ఒక్కరికి, ఫిజికల్ సైన్స్ లో ఇద్దరికీ, బయో సైన్స్ ఒక్కరికి ఇంగ్లీషులో ఇద్దరికీ, సోషల్ లో ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను సజావుగా సమర్థవంతంగా సీనియర్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను విద్యాశాఖ ఆన్లైన్ లో నమోదు చేశామని, 5న సబ్జెక్టుల వారిగా పాఠశాలల ఖాళీల వివరాలతో పాటు ఉపాధ్యాయుల ప్రమోషన్ల తుది జాబితాను విడుదల చెయ్యనున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి కురుమయ్య, ఏసీ రాజశేఖర్ రావ్, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, ఎంఈఓ భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టి, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES