Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి

ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-అలంపూర్
ఈనెల 17వ తేదీ న అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) జోగులాంబ గద్వాల జిల్లా రెండవ మహాసభలను జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ.వెంకటస్వామి, ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం మహాసభల విజయవంతం కోసం ప్రచార కార్యక్రమంలో భాగంగా శాంతినగర్, మానవపాడు, మానవపాడు స్టేజి, జల్లాపూర్ స్టేజి మరియు అలంపూర్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు నెలకు 12 వేల రూపాయలు జీవనభృతి ఇస్తామని తన మేనిఫెస్టోలో చెప్పారని రెండు సంవత్సరాలు కావస్తున్నా అమలు చేయడం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  దసరా పండుగ నుండి ఆటో డ్రైవర్లకు 15వేల రూపాయలు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వం 2019 మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ద్వారా రవాణా రంగ కార్మికులపై మోపుతున్న భారాలను, ప్రతి విషయానికి డ్రైవర్లనే బాధ్యులను చేస్తూ శిక్షించే విధంగాఉన్న చట్టసవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అడ్డాలకు స్థలాలు కేటాయించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్లoదరిని ఆదుకోవాలని కోరారు. ఈ మహాసభలో జిల్లాలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకుంటామని తెలిపారు.

మహాసభకు ముఖ్య అతిథిగా ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  పి శ్రీకాంత్ హాజరవుతున్నారని, జిల్లాలోని ఆటో, ట్రాలీ, జీపు, కారు, డీసీఎం, లారీ, బస్సు మరియు ట్రాక్టర్ తదితర వాహనాల డ్రైవర్లు అందరూ హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు మాలిక్ భాష, నాయకులు సాయిబాబు, రంగన్న,ఆంజనేయులు, షేక్ షావలి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులకుజి కె.ఈదన్న, శివకుమార్, రామకృష్ణ, అంజి, బషీర్, సుభాన్, సుధాకర్ రెడ్డి, నాగరాజు, అనిల్, సాములు, ప్రసాద్ కమల్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -