– ఊపిరి పీల్చుకున్న జనం
– జూపార్కుకు తరలించిన ఫారెస్ట్ అధికారులు
నవతెలంగాణ-గండిపేట్
ఎట్టకేలకు చిరుత పులి బోనుకు చిక్కింది. ఫారెస్టు అధికారుల శ్రమ ఫలించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి పరిధిలోని మంచిరేవుల గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. చిరుత సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకోవడానికి జిల్లా ఫారెస్టు అధికారులు తీవ్రంగా శ్రమించారు. అయినా చిరుత ఆచూకీ లభించలేదు. బుధవారం కూడా చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది. దాంతో మళ్లీ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు చిరుతను పట్టుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం మంచిరేవుల ఫారెస్టులోని బోన్‌లో చిరుత చిక్కింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి చిరుతను జూపార్కుకు తరలించారు.
చిక్కిన చిరుత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES