Sunday, October 26, 2025
E-PAPER
Homeక్రైమ్పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ట్రావెల్స్‌ బస్సు బోల్తా

పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ట్రావెల్స్‌ బస్సు బోల్తా

- Advertisement -

– డివైడర్‌ను ఢీకొట్టడంతోనే..
– పలువురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ- అబ్దుల్లాపూర్‌ మెట్‌

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ మియాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరుకు బయలుదేరిన ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్‌ ఉన్నారు. బస్సు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. దాంతో బస్సులో ఉన్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురు ప్రయాణికులను హయత్‌నగర్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి, మరో ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్‌ను కంచన్‌బాగ్‌లోని అపోలో (డీఆర్‌డీఓ) ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనా. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఏపీలోని కర్నూలులో ఓ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైన ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -