- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూరు
వాతావరణ కాలుష్యానికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. శనివారం వన మహోత్సవంలో భాగంగా కళాశాల ఆవరణలో చెట్లు నాటడం జరిగింది. విద్యార్థులు తమ ఇంటి ప్రదేశంలో చెట్లు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు భాగ్య వర్ధన్ రెడ్డి విశ్వేశ్వర్, కురుమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -