Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeసినిమాట్రెండీగా 'బూమ్‌ బూమ్‌..' సాంగ్‌

ట్రెండీగా ‘బూమ్‌ బూమ్‌..’ సాంగ్‌

- Advertisement -

హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ పాన్‌ ఇండియా మూవీ ‘డ్యూడ్‌’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్‌ సరసన మమిత బైజు నటించగా, శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘బూమ్‌ బూమ్‌’ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటని సాయి అభ్యాంకర్‌ స్వరపరిచి, పాడారు. ఎనర్జీటిక్‌ బీట్స్‌,ఆకట్టుకునే సాహిత్యంతో ఈ సాంగ్‌ యూత్‌కి అద్భుతంగా కనెక్ట్‌ అవుతుంది. సేనాపతి భరద్వాజ్‌ పాత్రుడు లిరిక్స్‌ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి.
దీప్తి సురేష్‌, భూమిక, సాయితో కలిసి అలపించిన పాట యూత్‌ ఫుల్‌ వైబ్‌తో అదిరిపోయింది. విజువల్స్‌, సరదాగా గడిపే ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌, ప్రదీప్‌ , మమిత కెమిస్ట్రీ, స్టైలిష్‌ డ్యాన్స్‌ మూవ్‌లతో సాంగ్‌ చాలా ట్రెండీగా ఉండటంతో ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది అని చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం , కన్నడ భాషలలో విడుదల కానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad