Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పోడు పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని… గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు

పోడు పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని… గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
ఈనెల మూడవ తేదీ బుధవారం నాడు గాంధారి నెహ్రూ చౌరస్తావద్దగిరిజనులతో కలసి మహాధర్నా  నిర్వహిస్తున్నట్లు గిరిజన జిల్లా గౌరవ అధ్యక్షులు మోతిరాం నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణాలు ఇవ్వాలని కలెక్టర్ కి మేనేజర్ కి ఎన్నోసార్లు వినతులు ఇచ్చిన చివరిగా కలెక్టర్  ఆదేశాలు జారీ చేసిన గాంధారి బ్యాంకు మేనేజర్ మాత్రం స్పందించడం లేదని ఇక్కడ ఉన్న రైతులు అటు బాన్స్వాడకు ఇతర బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకుంటున్నాడు. మధ్యవర్తులకు ఒక్కొక్కరి వద్ద నుండి 30000 చొప్పున లంచాలు ఇస్తూ పోడు రైతు నిండుగా మోసపోతావున్నాడు. గాంధారి బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అందుకే తాడోపేడో తెలుసుకోవడం కోసం బుధవారం నాడు మహాధర్నకు పిలిపిస్తున్నామని ఆ ధర్నాలో ప్రతి పోడు రైతు పాల్గొనాలని ఆ ధర్నాను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాతు సంగెం ,మడుగుతాండ గుజ్జుల్ సోమారం రామలక్ష్యం పల్లి నేరల్ రాంపురం గడ్డ, పేటి సంగం, కొత్త బాధి తండా రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad