- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డే సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త, మాజి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పురాం రాజమౌళి మెడికల్ అధికారి యేమిమాను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆర్య వైశ్య సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -