- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన అరేటి రఘుకు బుదవారం బిఅర్ఎస్ ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్, ఇందల్ వాయి మాజీ ఎంపిటిసి మారంపల్లి సుధాకర్ లు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో సర్పంచ్గా సహకార సొసైటీ డైరెక్టర్గా అంకితభావంతో ఉంటూ ప్రజల సమస్యలను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే వారని, రాబోవు రోజుల్లో కూడా గ్రామస్తులకు వెన్నంటే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు.
- Advertisement -



