Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీఓ నరసింహమూర్తికి సన్మానం.!

ఎంపీడీఓ నరసింహమూర్తికి సన్మానం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల పరిషత్ కార్యాలయంలో దాదాపు ఆరు సంవత్సరాల పాటుగా ఎంపిడిఓగా విధులు నిర్వహించిన గుండా నరసింహమూర్తి ఇటీవల నల్లబెల్లికి బధిలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ నెల 31న పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా మండల మాజీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆదివారం నల్లబెల్లి మండల పరిషత్ కార్యాలయంలో నరసింహమూర్తి-విజయ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. శేష జీవితం ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలొ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వరులతో గడపాలని దేవుడిని ప్రార్ధించ్చినట్లుగా తెలిపారు. తాను 32 సంవత్సరాల నుండి పంచాయతీ రాజ్ విభాగంలో సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియపారు ఈ కార్యక్రమంలో తాజా  మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,మాజీ వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య, మాజీ సర్పంచ్ లు జగన్ నాయక్,రమేష్,రాజు నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -