- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం కంఠం గూడెం ఆదివారం, కామ్రేడ్ ఫ్రీడమ్ ఫైటర్ కంఠం సాయిలు, వయసు 102 సంవత్సరాలు, నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించినారు. కావున వారి పారదేహానికి ఎర్ర జెండా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి దగ్గర కొరియర్గా పనిచేసినాడు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరు రాజయ్య యాదగిరిగుట్ట కార్యవర్గ సభ్యుడు నమ్మలే సంజీవయ్య గ్రామ శాఖ కార్యదర్శి కంఠం మోహన్ మొగ్గం రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -