- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రాహుల్ బంధు కాదు.. రైతుబంధు కావాలంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



