Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మద్నూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఈశ్వరమ్మ కుమారుడు కృష్ణ పటేల్ నాయకత్వంలో బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రజలకు సమాన హక్కులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ధరాస్ సురేష్, మద్నూర్ సింగిల్  విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు రవి, నాగేష్, రాజు, గోపాల్, హనుమాన్లు, సాయి, సుభాష్, శివాజఫ్ఫా, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -