సంస్మరణ సభలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, మోడీ, రాహుల్
న్యూఢిల్లీ : 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి పార్లమెంటు భవనంలో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ చైౖర్‌పర్సన్ సోనియాగాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పలవురు సీనియర్ పార్లమెంటు సభ్యులు నివాళులర్పించారు. వారి దైర్యసాహసాలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఒక పౌరుడితో సహా 14 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న ఈ దాడిని ప్రజాస్వామ్య దేవాలయంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులు ఈ సంస్మరణ సభలో పాల్గోని నివాళులర్పించారు.
భారత ప్రధాని మోడీ ప్రాణ త్యాగం చేసిన వారిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. వారి ధైర్యం, అప్రమత్తత కర్తవ్య భావన అసాధారణమైనదని తెలిపారు. రాహూల్‌గాంధీ ఘనంగా నివాళులర్పించారు. కాగా, 2001లో డిసెంబర్ 13న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాద సంస్థలకు చెందిన ఐదుగురు భారీ ఆయుధాలతో పార్లమెంటు క్లాంప్లెక్స్‌లో చొరబడి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పార్లమెంటుపై దాడిలో మృతులకు నివాళులు
- Advertisement -
- Advertisement -



