Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్రిబుల్‌ ఆర్‌ బాధితుల అరెస్టు

త్రిబుల్‌ ఆర్‌ బాధితుల అరెస్టు

- Advertisement -

మంత్రి కోమటిరెడ్డిని కలిసేందుకు ఇందిరాభవన్‌కు రాక
అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు


నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం త్రిబుల్‌ ఆర్‌ బాధితులను పోలీసు అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు శనివారం హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని కలిసేందుకు నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన త్రిబుల్‌ ఆర్‌ బాధితులు గడియారం సెంటర్‌లోని ఇందిరా భవన్‌కు చేరుకున్నారు. దాంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తాము ఉగ్రవాదులు కాదని, భూములు పోతుంటే మంత్రిని కలిసి బాధలు చెప్పుకుందామంటే పోలీసులు తమపై బల ప్రయోగం చేయడమేంటని రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఫస్ట్‌ అలైన్‌మెంట్‌ ప్రకారంగానే త్రిబుల్‌ ఆర్‌ నిర్మించాలని లేదా తమకు మార్కెట్‌ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. అప్పటివరకు పనులను సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -