- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడుగా మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన విరమనేని సంపత్ రావు ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ తోపాటు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది సన్మానించారు.
- Advertisement -