యూరియా కోసం రైతుల పాట్లు..
– లైన్లో ఉన్నవారికి బస్తాలు ఇవ్వాలని డిమాండ్…
నవతెలంగాణ – గన్నేరువరం
రైతుల సౌకర్యార్థం మండలంలోని జంగ పెళ్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మరొక అనుబంధ ఎరువుల దుకాణాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రారంభోత్సవం చేయనున్న సందర్భంలో యూరియా వచ్చిందని సమాచారం మేరకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎరువుల దుకాణానికి చేరుకున్నారు. చాలా సేపు అక్కడే పడిగాపులు కాచారు. అయితే నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి ఆ తర్వాత యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్లో నిలబడిన ప్రతి రైతుకు ఒక్క బస్తా అయినా ఇవ్వాలని పట్టుబట్టారు. ఏవో కిరణ్మయి సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పారు. ఈరోజు టోకెన్లు ఇచ్చిన తర్వాత బుధవారం ఎరువుల దుకాణం ప్రారంభించి, ఎరువుల పంపిణీ చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రారంభోత్సవానికి ముందే పరేషాన్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES