– 22 మంది మృతి
– వీరంతా టీఎస్టేట్ కార్మికులు
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో హయులియాంగ్ చాగ్లగాం మధ్య 40వ నెంబర్ మైలు రాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ట్రక్కు లోయలో పడి 22 మంది కార్మికులు మృతి చెందారు. వీరంతా అసోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన వారని టిన్సుకియా జిల్లా కమిషనర్ స్వప్నీల్ పాల్ మీడియాకు వెల్లడించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అంజా జిల్లాలో ఓ వాహనం లోయలో పడినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఘటనా స్థలానికి ఆర్మీ సహాయక బృందాలు చేరుకుని మృతదేహాలను వెలికితీశాయి. గాయపడిన వారిని సహాయక బృందాలు అతికష్టం మీద రక్షించి.. స్థానిక ఆస్పత్రికి తరలించాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
అరుణాచల్‌లో లోయలో పడిన ట్రక్కు
- Advertisement -
- Advertisement -



