Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంట్రంప్‌..బఫూన్-ఇన్-చీఫ్: ఎంపీ అసదుద్దీన్

ట్రంప్‌..బఫూన్-ఇన్-చీఫ్: ఎంపీ అసదుద్దీన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. భారత ప్రభుత్వాన్ని బెదిరించడం బాధగా ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.

ట్రంప్ చర్యలు భారతదేశ సార్వభౌమాధికారం, ఆర్థిక స్థితిపై ఉద్దేశపూర్వక దాడి చేస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. భారత ప్రభుత్వాన్ని ‘వైట్ హౌస్‌లోని బఫూన్-ఇన్-చీఫ్’ బెదిరించడం విచారకరమని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పెరుగుతున్న శత్రుత్వాన్ని చాలా సంవత్సరాలుగా పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నట్లు గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -